మనసాక్షి మహా శక్తి – గెస్ట్ కాలం బై ‘మీ శ్రేయోభిలాషి’

0

vlcsnap-2016-02-21-20h55m02s220మనం పుట్టిన దగ్గర నుండి లేదా ఊహ తెలిసినప్పటినుండి తెలిసో తెలియకో ఎన్నో తప్పులు, మంచి, చెడు చేస్తూ ఉంటాం. కొంతమందికి మనసాక్షి అనేది చాల చిన్న వయసు నుండే మంచి దారి చూయిస్తుంది, చేసే ప్రతీ పని తప్పో ఒప్పో అన్నది చాలా సులువుగా తెలిసేలా పనిచేస్తుంది. కొంతమంది కి ఎన్నో తప్పులు చేసిన తరువాత ఎదో ఒక్క తప్పు తిప్పి కొట్టిన తరువాత కలిగే అనుభవం తో మొదలవుతుంది. తప్పులు సహజంగా అందరు చేస్తారు కాని తప్పులు అందరు ఒప్పుకోరు, ఒప్పుకోలేరు. వారిని వారి మీద ఉన్న ఉద్దేశాలు చెడిపోయి ఎక్కడ వెనుకపోతమో లేదా ఎన్ని తప్పులు చేసిన మంచివాడిలానే అని ముద్ర వేయించుకోవాలి అనే తపన.

ఏముంది చెప్పండి! తప్పు చేస్తే ఏంటి ఒప్పు చేస్తే ఏంటి అన్నిటికి ఎంత చెండాలుడు  అయిన మనసాక్షి అనే మహా శక్తి  ఉంటుంది. చేసిన పని తప్పు అనిపిస్తే వీలైన తొందరగా ఆ తప్పుని లేదా ఆ తప్పు వల్ల ఇబ్బంది పడ్డ లేదా పడుతున్న వారికీ మనం ఏమి చెయ్యగలం వాళ్ళ ఆనందాన్ని వెన్నక్కి ఇవ్వలేకపోవచ్చు గాని మనం క్షమాపణ వారికి కొండంత శక్తీ వాళ్ళు తప్పు చెయ్యలేదు అనే భావన నీ క్షమాపణతోనే కలుగుతుంది. ఒక చిన్న క్షమాపణ నీలో కూడా గోప్పటి భావాన్ని ఇస్తుంది అది అంగీకరించని వాళ్ళని ఎలాగో ఈ క్షణం లో మార్పు తీసుకురాలేము గాని ఎదో ఒక రోజు వాళ్ళకి కూడా ఆ గొప్పదనం తెలుస్తుంది.

జీవితం అంటే ఏమి లేదు మనం, మన మనసాక్షి అంతే. రోజు అదే పొద్దున అదే రాత్రి కాని ఒక్కసారి చీకటి పడగానే మనలో మనకే తెలియని ఎదో బాధ ఏదో కోల్పయామో ఏమి సాధించామో తెలియదు గాని మనలో ఎదో నిశబ్ధం అది అలసిపోయి కాదేమో, మన మనసు కోరుకున్నవి ఇవ్వలేకపోనందునేమో , లేదా సంతృప్తి లేదో గడిపే జీవితం మీద, లేదా ఎదో చెయ్యాలి మనకి కావాల్సిన దానికోసం మనం ప్రయత్నం సరిపోవడం లేదేమో. ఏమో… ఈ చీకటి నన్ను మంచి మనిషిని చేస్తుందో ఏమో గాని మనసు మాత్రం ఎదో ఆలోచిస్తుంది పోనీ నేను చేసిన పనులు ఏమైనా తప్పా? అసలు నేను చేస్తున్నది ఏదైనా మంచేన అసలు. ఛా ….. ఏంటి రా ఈ జీవితం మనసులో ఒకటి బయట ఒకటి బ్రతకడం వల్లనే ఇదంతా అని అనిపించింది. ఆ బాధంతా మనసులో దాగి ఉంది బయటికి చేపలేని వాటి వాళ్ళ కావచ్చు.

అసలు నిజంగా బ్రతికితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది గాని ఎదుట వాళ్ళు అలా ఉండకపోతే అందరిలో నేను వేరుపడిన వాడిని అవుతాను ఐతే ఇయ్యను లే ఎదో ఒక రోజు నేను ఉన్న విధానానికి కూడా మంచి మార్కులు పడతాయేమో… ఏది ఏమైనా నేను నిజంగా బ్రతకాలి అందులో నాతో ఉండేవాళ్ళకి పూర్తీ ఆనందాన్ని ఇవ్వగలనేమో నేను వేసే అడుగులకు ఒక అర్ధం ఉంటుందేమో. ఈ చీకటిలో ఉండే నిశబ్దానికి మంచి బదులు ఇవ్వగలనేమో అబ్బ అందరు వాళ్ళ  వాళ్ళ మనసాక్షికి విలువనిచ్చుకుంటే ఎంత బాగుంటుందో . మనం చేసే ఒక తపు వల్ల వచ్చే ప్రతిస్పందన తట్టుకునే శక్తి మనకుందో లేదో తెలియదు గాని ఒక మంచి పని వల్ల వచ్చే ప్రతిస్పందన మన మసాక్షి పొందే ఆనందం అనంతం!!NO COMMENTS

LEAVE A REPLY