Bengal Tiger Telugu Movie Review by Rajesh Manne

0

రివేంజ్ ఎంటర్టైనర్ గా ‘బెంగాల్ టైగర్’
టైటిల్ :- బెంగాల్ టైగర్
బ్యానర్ :-శ్రీ సత్య సాయి ఆర్ట్స్
నటినటులు :-రవి తేజ, తమన్నా,రాసి కన్నా, బొమాన్ ఇరాని, పృథ్వి, బ్రహ్మానందం,సాయాజీ షిండే తదితరులు.
మ్యూజిక్ :-భీమ్స్ సేసిరోలియో
నిర్మాత :- కె.కె. రాధ మోహన్
కథ మాటలు , దర్శకత్వం :-సంపత్ నంది
bengal tiger review
కథ :- పల్లెటూరిలో అల్లరి చిల్లరిగా తిరిగే ఆకాష్(రవితేజ) మనిషంటే ప్రపంచానికి తెలిసుండాలి అని ఒక అమ్మాయి చెప్పిన మాట పట్టుకొని ఫేమస్ అవ్వడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం ద్వారా ఆకాష్ శ్రద్దా(రాసి ఖన్నా) ,మీరా (తమన్నా) లకు దగ్గరవుతాడు. అలా దగ్గరైనా ఆకాష్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తన రివేంజ్ ను చివరికి ఎలా తీర్చుకున్నాడు? అనేదే కథ.
టెక్నిషియన్స్ :- కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను చాలా అందంగా చూపించి కనువిందు చేసాడు సౌందర రాజా. గౌతంరాజు ఎడిటింగ్ పరవాలేదు. బీమ్స్ అందించిన పాటలు, బాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సంపత్ నంది స్క్రీన్ ప్లే బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. కొన్ని పాటలకు కోరియోగ్రఫీ కుదరలేదు.
నటి,నటులు :- రవితేజ తన ఎనెర్జి నటనతో మెప్పించాడు. రాశి కన్నా, తమన్నా ఇద్దరు వారి గ్లామర్ తో అలరించారు. ఫీచర్ స్టార్ సిద్దప్ప పాత్రలో పృథ్వి తన నటనతో తెగ నవ్వించాడు అమల పౌల్ పాత్రలో బ్రహ్మానందం పాత్ర నవ్వించక పోగా కాస్త బోర్ కొట్టించింది. సెలబ్రిటీ శాస్త్రి గా పోసాని, నాగప్ప పాత్రలో రావు రమేష్ , ముఖ్యమంత్రి పాత్రలో బొమాన్ ఇరాన్, జై నారాయణ్ పాత్రలో నాగినీడు వారి పాత్రలకు న్యాయం చేసారు. ఇక మిగతా నటి నటులందరు తమ పాత్రలకు న్యాయం చేసారనే చెప్పాలి.
విశ్లేషణ :- నాంపల్లి గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం చేప మందు వేస్తారు ఆ సమయంలో ఒక సారి ఒకరి నోట్లో నుండి మరొకరి నోట్లోకి ఈ మందు వెయ్యడం పట్ల అప్పట్లో కొంత ఈ మందు పై అసంతృప్తి వ్యక్తం చేసారు కొందరు. అప్పుడే ఈ పాయింట్ రాసుకున్నట్లున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఎంచుకున్నది రొటీన్ రివేంజ్ కథే అయినప్పటికీ తన స్క్రీన్ ప్లే తో కొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. మొదటి బాగం అలాగే కొత్త స్క్రీన్ ప్లే తో కామెడీ డైలాగ్స్ తో కామెడీ సీన్స్ తో ఎంటర్ టైనింగ్ గా తీసినప్పటికీ 2వ బాగం రొటీన్ గా తెరకెక్కించి కాస్త బోర్ కొట్టించాడు. మొదటి బాగంలో సినిమా పిచ్చి ఉన్న పృథ్వి పాత్రతో నవ్వులు పువ్వులు పూయించాడు. కొన్ని సీన్స్ తో మాస్ ప్రేక్షకులను కూడా బాగా ఆనందింప జేశాడు సంపత్. ముఖ్యంగా సినిమా ప్రారంభం లో రవితేజ బురదలో ఉన్నరౌడీలను తొక్కుకుంటూ వచ్చే సీన్ మరియు తమన్నా నుదిటి పై నుండి నీటి బొట్టు తన సొగసును చూపూతో వెళ్ళే సీన్ మాస్ ప్రేక్షకుడికి తెగ నచ్చేస్తుంది. సినిమాలో డి.ఐ వర్క్ కన్నా రవి తేజ పేస్ లోనే ఎక్కువ కనిపించింది. ఇక ఏది ఏమైనా సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కోరుకునే సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా బాగా నచ్చుతుందనే చెప్పాలి.

రాజేష్ మన్నె



NO COMMENTS

LEAVE A REPLY