Must Read ! “If You Love Truly .. You’ll Find Them Someday And You’ll Live With Them Daily”

0

written by Naga Sai

Feb 2, తెల్లవారుజాము, 5:30 అవుతుంది సమయం .. ఆకాశంలో సూర్యుడు గెలుపు చాటుతుండగా, చంద్రుడు చిన్నగా జారుకుంటున్నాడు .. ఇంట్లో హడావిడి .. అమ్మ నిద్రలేపింది .. అంతా సందడిగా ఉంది .. నాకు మాత్రం ప్రతి ఉదయంలా ఇదొక మామూలు ఉదయమే కాకపోతే రోజూ కంటే ఒక గంట ముందే మొదలయింది నా రోజు కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇది మామూలు రోజు కాదు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న “నా పెళ్లి రోజు”. అవును ఇవాళ నా పెళ్లి .. ఇప్పటిదాకా మా ఇంట్లో వంట మా అమ్మ చేసేది రేపటి నుండి నా భార్య చేస్తుంది .. బెడ్రూంలో నాతో పాటు ఇంకో మనిషి తొడవుతుంది  .. అంతే ఇంతకు మించి నాకు తేడా ఏమి లేదు .. నా మటుకు నాకు ఈ పెళ్లి మా అమ్మ కన్నీటికి ఫలితం, మా నాన్న భాదకి మూల్యం, నా ఆశకి అడ్డం అంతే .. ఇష్టం లేని పెళ్లి కాదు .. పెళ్లి కూతురు నచ్చకపోతే ఇష్టంలేని పెళ్లి అంటారు అసలు పెల్లే నచ్చకపోతే ఏం అనాలో నాకూ తెలీదు. కారణం కూడా ఒక అమ్మాయే
Feb 14th 2004, నేను 10th క్లాస్ .. ఒక రోజు మంచి వర్షం, ఆ గాలిలో ఇంట్లో ఫీజుకి అని ఇచ్చిన డబ్బులు పోగొట్టేసుకున్నాను .. ఇంటికెళ్ళంటే భయం, బయిట వెతకాలంటే వర్షం ఆ ఆలోచనలతో సైకల్ తొక్కుతున్నాను .. ఎందుకు ఆపానో తెలీదు కానీ సైకల్ ఆపేశాను .. కరెక్ట్ గా ముందు టైర్ కి ముందు ఒక ఫోటో .. తిరగపడి ఉంది .. ఎందుకు తియ్యలనిపించిందో కానీ తీశాను .. ఏదో మాయ జరిగినట్టు .. జరిగినట్టు కాదు నిజంగా మాయే ఆ ఫోటో కింద డబ్బులు, కరెక్ట్ గా 5250 నేను పోగొట్టుకున్నన్ని కాదు నేను పోగొట్టుకున్నవే .. ఆ వానలో గాలికి ఆ ఫోటో ఆ డబ్బులపై పడకపోయి ఉంటే ఇవి నాకు మళ్ళీ దక్కేవి కాదు .. ఇంతకీ ఏమిటీ ఫోటో అని దాని వైపు చూశాను .. అప్పుడు కనిపించింది అదేదో సినిమా హీరోయిన్ లాగా లేదు కానీ గట్టిగా దూరేసింది నా ఆలోచనల్లోకి  .. అమ్మాయి బావుందనో లేక తన వళ్ళ నా డబ్బులు దొరికాయి అనో తెలీదు కానీ కళ్ళుతిప్పుకోలేకపోతున్నా ఆ నవ్వుతున్న తన ఫోటో నుండి .. వర్షం మీద పడటం లేదేమో, చలి కూడా చెమటలా అనిపించింది .. నేను ఉన్న చోటుని కూడా మర్చిపోయి అలానే రోడ్ లోనే ఉంది పోయా వెనుక నుండి ఒక కార్ అయిన తిట్టేదాకా .. నా వయసు ఉండచ్చు తనకి .. స్కూల్ యూనిఫాం లో ఉంది కానీ అది ఏ స్కూల్దో తెలీదు కనుక్కుందాం అని తర్వాత చాలా ట్రై చేశా ఎవరు తెలీదన్నారు బహుశా ఏదో చిన్న స్కూల్ అయ్యుండాలి లేక వేరే ఊరు అయ్యుండాలి .. నా డబ్బుకి తనని తానే అడ్డేసి కాపాడిన ఆ అమ్మాయి నాకు కావాలనిపించింది .. తన కోసం వెతకాలనిపించింది .. వెతికాను వందల చుక్కలున్న ఆకాశంలో నా తార కోసం వెతికాను  .. ఊరిలో ఉన్న వీధి, వీధి వెతికాను .. అవి 10th సెలవలు అందరూ ఊర్లకెళ్లారు కానీ నేను మాత్రం  వెతుకుతూనే ఉండిపోయాను .. ప్రతి క్షణం ఆ చూపు నన్ను రమ్మనిపిలిచేది  .. పిచ్చి వాడిని చేసి ఊరంతా తిప్పేది  .. అయిన ఆమె జాడ లేదు .. ఒక్క ఫోటోకి మనిషిని వశం చేసుకునే శక్తి ఉందా అనిపించింది .. ఆమెని అన్వేషిస్తూనే ఇంటర్లో చేరాను .. ఏ ఒక్క క్షణం  తనని మర్చిపోలేదు గట్టిగా గాలి వీచినప్పుడు గుర్తొచ్చేది .. చల్లగా మంచు కురిసినప్పుడు గుర్తొచ్చేది .. అందమైన పెయింటింగ్ కనపడినప్పుడు,ఒక మంచి పాట వినిపించినప్పుడు, ఏది బలంగా మనసుని తాకినా తనే గుర్తొచ్చేది .. మనసుని తాకినవాటన్నిటికీ బలం తనే ఇచ్చేది .. అలానే ఇంటర్ అయిపోయింది .. ఏదో చదివాను మొత్తానికి పాస్ అయ్యాను .. నేను చాలా మారాను, మీసాలు వచ్చాయి, హైట్ వచ్చాను, కలర్ తగ్గాను. పైన వచ్చిన మార్పులు ఇవి కానీ లోపల ఏమి మారలేదు తన కళ్ల కోసం, ఆ నవ్వు కోసం, ఆమే కోసం అనువణువు గాలిస్తూనే ఉన్నాను .. తన కోసం వెళ్ళిన ప్రతిచోటా ఓటమే గెలిచేది .. ఈ ఘర్షణలోనే బి-టెక్ అయిపోయింది నాది .. నా బ్యాచ్ మేట్స్ అందరూ లవ్ లో పడి బ్రేక్ అప్ లు కూడా అయిపోయాయి కానీ నా ప్రేయసి మాత్రం ఇంకా ఎదురవ్వనేలేదు .. ఎప్పుడు ఎదురవుతుందా అనే ఉశ్చాహ౦ తగ్గి అసలు కనిపిస్తుందా అనే భయం పెరిగింది నాలో .. నా భయంతో సమానం గా ఇంట్లో బెదిరింపులు కూడా పెరిగాయి .. పెళ్లి చేసుకోకపోతే అసలు మమ్మల్ని మర్చిపో అన్న స్థాయికి చేరాయి .. తప్పు లేదు ఇప్పటికే నా వయసు 29ఏళ్ళు ఇంకా వాళ్ళు మాత్రం ఎన్నాళ్లని వెయిట్ చేస్తారు .. వాళ్ళ బాధలో న్యాయం ఉందనిపించింది కానీ నా మనసుకి ఆ అమ్మాయే కావాలనిపించింది .. ప్రేమించిన అమ్మయా?లేక పెంచిన అమ్మ,నాన్నా?అన్నప్పుడు అమ్మ నాన్నేగెలిచారు అలా అని ఆమే మీద ప్రేమ ఓడిపోలేదు రాజీపడింది అంతే .. పెళ్ళికి ఒప్పుకున్నాను .. అంతే హడావిడిగా అమ్మాయిని చూసేశారు, ముహూర్తాలు పెట్టేశారు .. ఇంకాసేపట్లో నేను ఒక భర్తనవ్వబోతున్నాను ఎవరో తెలియని ఒక అమ్మాయికి .. ముహూర్తానికి టైమ్ అయినట్టుంది పంతులు గారు తాళి కట్టమన్న సైగ చేశారు .. నా చేతిలో ఉన్నది పసుపు తాడు కాదు నా ఆలోచనాలకి సంకెళ్లు .. వణుకుతున్న వేళ్ళతో సిగ్గుతో మెరుస్తున్న ఆమే మెడకి మూడు ముళ్ళు వేశాను .. ఇప్పుడు ప్రపంచానికి ఈమె నా భార్య కానీ నా ప్రపంచంలో కేవలం ఇంకో కొత్త వస్తువు .. పెళ్లి తర్వాత అమ్మ బలవంతం మీద వేరే ఇళ్ళు తీసుకున్నాం మేము .. పెళ్లి తర్వాత కూడా ఇంకా ఆ ఫోటో నా పుర్సెలోనే ఉంది .. ఒక రోజు స్నానానికి వెళుతుండగా ఆమె నా పర్స్ ని చూడటం చూశాను .. వెంటనే ఆపుదాం అని వెళ్లా .. పొరపాటున తను ఆ ఫోటో చూసేస్తే ఎక్కడ ఆ ఫోటోని కూడా కోల్పోతానో అనే భయంతో .. కానీ దురదృష్టం మళ్ళీ నా మీద పై చెయ్యి సాదించింది ఆమే పర్స్ ఓపెన్ చేసెసింది .. ఇవాళ గొడవ తప్పదు అన్న ఆలోచనలతో కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను ఆమే భావాలు చూడలేక .. నిశ్శేబ్ధం .. ఆ నిమిషం నాకు నిశ్శేబ్ధం అనే శబ్ధం తప్ప ఇంకే శబ్దం వినపడలేదు .. గడిచే ప్రతి మిల్లీ సెకను ఒక పిడుగులా తోచింది .. నా ఓపిరి వేడిని బరించలేకపోయాను .. ఏదైతే అది అవుతుంది అని నన్ను నేను సిద్దం చేసుకొని కళ్ళు తెరిచి చూపు తన వైపు మలిచాను .. కోపం తోనో, కన్నీళ్ళ తోనో ఉంటాయి అనుకున్న తన కళ్ళు వేరే ఏదో వ్యక్తం చేస్తున్నాయి . ఆ నిశ్శబ్దాన్ని చిలుస్తూ
“నా చిన్నప్పటి ఫోటో మీకెలా ….”అని ఏదో అనబోయింది కానీ నాకు ఇంకేమీ వినపడట్ల .. మొదటిసారి తల పైకెత్తి ఆమె కళ్లని చూసా అవును ఆ కాలువలే .. ఊపిరి ఆగినట్టుంది, ప్రపంచం తిరగబడ్డట్టు, పోయిన ప్రాణం మళ్ళీ వచ్చి పడ్డట్టు పట్టలేని సంతోషం, అమితమైన ఆశ్చర్యం ఇంకేమీ మాట్లాడలేకపోయాను .. తన ప్రశ్నకి సమదానం చెప్పమని అంటున్నాయి ఆ కళ్ళు ..
“ నిన్ను సప్రైస్ చేద్దాం అనీ మీ స్కూల్ నుండి తెచ్చాను” అని నాకు పెద్దగా అలవాటు లేదు అబద్ధాన్ని చెప్పేశాను బహుశా షాక్ లో ఉండటం వాళ్ళ అనుకుంటా .. అంతే అమాంతం వచ్చి కౌగిలించుకుంది.. చాలు ఈ జీవితానికి ఈ ఒక్క క్షణం చాలు .. నేను కనీసం చూడాలి అనుకున్న అమ్మాయి ఇప్పుడు నా కౌగిలిలో ఒదిగిపోయి ఉంది .. అన్నట్టు ఇవాళ డేట్ కూడా అదే “Feb14th”.

If You Love Truly .. You’ll Find Them Someday And You’ll Live With Them Daily <3 <3NO COMMENTS

LEAVE A REPLY