చెన్నై వరదల  కి రూ.1.00.000/-  విరాళం ప్రకటించిన నిర్మాత ప్రతాప్ కోలగట్ల 

0

ఎల్లప్పుడూ  తన వంతు  ఏదో సహాయం  చేస్తూ కొందరికి బరోసా కల్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నిర్మాత ప్రతాప్ కోలగట్ల(3జి లవ్).
pratap kolagotla
ఇక గతం లో వైజాగ్ హూద్ హూద్ తుఫాన్ భాధితుల సహాయార్ధం 1లక్ష విరాళాన్ని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గారిని కలిసి అందించారు ప్రతాప్. ఇక సూర్య, విశాల్  వంటి  తమిళ నటులు  మన వైజాగ్  హుడ్ హుడ్ తుఫాన్ కి  స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు.
 ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నై ని తాకింది. ఈ సమయం లో మన  తెలుగు చిత్ర పరిశ్రమ నుండి  స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.1.00,000 అందిస్తున్నాను. అని నిర్మాత ప్రతాప్ కోలగట్ల  ప్రకటించారు.. అతి త్వరలో  ముఖ్య మంత్రి  జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని  తెలిపారు.  తన బాటలోనే  మన తెలుగు చిత్ర పరిశ్రమ కు  సంబంధించిన మరి కొందరు ముందుకు వచ్చి సహాయం  అందించాలని  తన  ఆశా భావాన్ని వ్యక్త పరిచారు.


NO COMMENTS

LEAVE A REPLY