నవంబర్ 27న విడుదల కానున్న ‘లవ్ స్టేట్స్’

0

ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్న లవ్ స్టేట్స్ చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉందని తెలియచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికేట్ పొంది సభ్యులనుంచి మంచి స్పందన వచ్చింది. ఒక తెలంగాణా అమ్మాయి, ఒక ఆంధ్ర అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కధని చక్కగా, ఆహ్లాదంగా చూపించడం ఆకట్టుకుంది అని వారు తెలియచేశారు. పాటలకు యువత, మాస్ నుంచి చాల మంచి స్పందన వచ్చింది. ప్రముఖ మోడల్ ఉపేన్ ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు.
 
ఈ చిత్రం హేజెన్ ఎంటర్టైన్మెంట్స్, అన్వితా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడుతున్నది. ఉపేన్, అంబిక సోని (తొలి పరిచయం), తాన్య శర్మ (తొలి పరిచయం), ఎం ఎస్ నారాయణ, ‘జబర్దస్త్’ చంటి, ‘అల్లరి’ సుభాషిణి  తదితరులు  ఈ చిత్రం లో నటినటులు. సంగీతం: పవన్ శేషా మరియు సినిమాటోగ్రఫీ: గౌతమ్ సిద్ధార్థ, శరత్ షెట్టి అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ ఉదయ్ కుంభం. శ్రవణ్ కుమార్ నల్లా  దర్శకుడు గా ఈ చిత్రానికి నిర్మాతలు గా పుట్టగుంట సతీష్, ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.


NO COMMENTS

LEAVE A REPLY