అవునంటు కోరుకుంది. కాదంటూ ఆపుతుంది. ఏదైనా నాపైన ఉన్న ఇష్టమే కదా!

0

అవునంటు కోరుకుంది. కాదంటూ ఆపుతుంది. ఏదైనా నాపైన ఉన్న ఇష్టమే కదా!

అవును.. కాదు.. ప్రేమ.. ఏమో.. నిజమే.. కదా!

ఏంటో కొన్ని సార్లు ప్రేమ విషయం గుర్తొస్తే తెలియని భయం ఆపై కొంత తెలిసిన సంకోచం. నిన్నే కదా తనతో మాట్లాడింది. బెంగుళూరు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇచ్చే టైం లో తనని కౌగిలించుకొని నుదిటి మీద ముద్దు పెట్టిన క్షణం నుండి ఈ శీర్షిక రాస్తున్న క్షణం వరకు తెలిసి తెలియని భావోద్వేగాల నడుమ జీవితం సాగుతుంది.

“ఎప్పుడ్డూ ఉండే సినిమాల గోలే కదా. ఒక వీకెండ్ సెలవు పెట్టి తనతో బెంగలూరు వెళ్ళాల్సింది. మళ్ళి ఎప్పటికి కుదురుతుందో?” అని నాతో నేను అనుకుంటున్న సందర్భంలో తన నుండి ఫోన్.

“ఇంటికి కి చేరిపోయాను! ఐ విష్ యు వర్ హియర్. మిస్ యు” తన మాటల్లో నా పైన ఉన్న ఇష్టం చాల స్పష్టంగా ఉంది. ఏమి తోచడం లేదు. తను పరిచయమై ఇప్పటికీ మూడేళ్ళు! ఇంతకు ముందు ఏ ఒక్క రోజు ఇంత బాధ పడలేదు నేను. తను ఎక్కడికి వెల్లిపొయిన్ధనీ? పక్కనే ఉన్న బెంగుళూరు కే కదా వెళ్ళింది. అయినా తను దూరం అయిందని బాధ పడుతున్నాను.

avunantoo korukundhi, vadhantu aaputhundi, edaina naa paina unna ishtame kadha
avunantoo korukundhi, vadhantu aaputhundi, edaina naa paina unna ishtame kadha

కొన్ని సార్లు ప్రేమ దగ్గరవుతున్న కొద్ది, ప్రేమ దూరమైపోతుందేమో అన్న ఆలోచన వేదిస్తుంది. కారణాలేమి లేవు కాని కలవరింతకు మాత్రం లోటు లేదు. మూడేళ్ళ క్రితం ఒక ఫంక్షన్ లో కలిసింది తను. చుసిన వెంటనే.. పడిపోయా! అందుకే “నువ్వంటే ఇష్టం అని చెప్పేసా!” తను పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వలేదు. “థాంక్స్!” అని మాత్రం చెప్పి వెళ్లిపోయింది. అమ్మాయి కదా తన భావాలు దాచుకుంది అనుకున్నాను! మళ్ళి కలిసాము.. మళ్ళి మళ్ళి కలిసాము. తన మీద నాకున్న ప్రేమ రెట్టింపవుతుంది కాని తనకి మాత్రం నేను చూపిస్తున్న ప్రేమ నచ్చింది. నచ్చింది అంతే, ఇంకేం లేదు! అందుకే ఇష్టం అని చెప్తుంటే, ఏం కష్టమొస్తుందనో దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా అందుకే కావాలని బెంగుళూరు వెళ్ళిపోయింది.

తను కూడా నన్ను కావాలనుకుంటుంది.. కాని అంతలోనే ఎందుకో దూరం అవుదాం అనుకుంటుంది.

అవును.. కాదు.. ప్రేమ.. ఏమో.. నిజమే.. కదా!

అవునంటూ కోరుకుంది. కాదంటూ ఆపుతుంది. ఏదైనా నాపైన ఉన్న ఇష్టమే కదా!

రాయరావ్ శ్రీరామ్NO COMMENTS

LEAVE A REPLY