సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా బతుకమ్మ లఘుచిత్ర మరియు బతుకమ్మ పాట ప్రదర్శన

0

వివేక్ కైపా పట్టాభిరాం దర్శకత్వంలో లత బిత్తిని నటించి, నిర్మించిన లఘు చిత్రం, బతుకమ్మ పాట ప్రదర్శన ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, మహేశ్వర గ్రూప్స్ అధినేత.శ్రీ కల్వకుంట్ల తేజేశ్వర్ రావు గారు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్ రాజేషం గౌడ్ గారు, Ex. MLC గారు, తెలంగాణ స్టేట్ కమీషన్ ఛైర్మన్ చెన్నయ్య గారు, నిర్మాత రామ సత్యనారాయణ గారు, నిర్మాత మల్కాపురం శివకుమార్ గారు, కోయిల్ సాగర్ ఛైర్మన్ ఉమా మహేశ్వర్ రెడ్డి గారు, మణికొండ మాజీ సర్పంచ్ హెచ్.నాగేందర్ రెడ్డి గారు, మణికొండ మాజీ ఎంపీటీసీ రామకృష్ణా రెడ్డి గారు, రాఘవ రెడ్డి గారు, ఎంపీపీ తలారి మల్లేష్ గారు, తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా నటి, నిర్మాత లత మాట్లాడుతూ..
తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. అటువంటి విశిష్టమైన పండుగ గురించి షార్ట్ ఫిల్మ్ ను, పాటను తన బ్యానర్లో నిర్మించడం చాలా సంతోషంగా ఉందని, ఈ షార్ట్ ఫిల్మ్ ను చూసి మా యూనిట్ ని ఆశిర్వదించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నన్ను నటిగా ఆదరించారు. ఇప్పుడు నిర్మాతగా మీ ముందుకు వచ్చాను. మా బతుకమ్మ పాటను, లఘుచిత్రాన్ని ప్రతీ ఒక్కరూ చూసి ఆశిర్వదించాలని ఆమె ప్రేక్షకులను కోరారు. మీ అందరి సహకారంతో ఈ లఘుచిత్రాం, పాట సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. దీనిని హిట్ చేస్తే ఇటువంటివి మరిన్ని చేయడానికి స్పూర్తిని ఇచ్చినవారు అవుతారని, తద్వారా మరిన్ని చిత్రాలతో మీ ముందుకు వస్తానని అన్నారు. ఇంతమంచి పాటను రాసి పాడిన మిట్టపల్లి సురేందర్ కు ఈ సంధర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. డైరెక్టర్ వివేక్, కెమెరామెన్ వినోద్, సంగీత దర్శకులు ఎస్.ఎస్. రాజేష్ ఎడిటర్ జస్విన్ ల సహకారంతో ఇంతమంచి అవుట్ పుట్ సాధ్యం అయ్యిందని ఇందులో నటించిన నటీనటులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. బేబీ ప్రజ్ఞ పాటకు ప్రాణం పోసిందని ఈ లఘచిత్రం చూసి అందరూ అభినందిస్తుంటే ఆనందంగా ఉందని అన్నారు.

షూటింగ్ ను మహబూబ్ నగర్, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో చేశామని చెప్పారు. బతుకమ్మ పాటని నా స్వగ్రామమైన చర్ల బూత్కూర్ లో నిర్మించామని వెల్లడించారు. తన కోసం తరలివచ్చి షూటింగ్ అయిపోయేవరకు ఓపికగా ఉన్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉండడానికి వసతి, భోజన సదుపాయాలను కల్పించిన దాసరి జానకి రాఘవ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ రమణారెడ్డి గారికి, Mptc బుర్రా తిరుపతి గౌడ్ గారికి మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఈ సంధర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మహబూబ్ నగర్ లో సహకారం అందించిన ఉమామహేశ్వర్ రెడ్డి గారికి, పర్థిపూర్ గ్రామ సర్పంచ్ రాము గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మాణంలో సహాయం అందించిన రవి మోసం(యూఎస్ఏ) గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

డైరెక్టర్ వివేక్ కైపా పట్టాభిరం మాట్లాడుతూ…
నేను గతంలో శంకర్ మహదేవన్ తో కలిసి ఉమెన్ ఆంత: అనే వీడియో ఆల్బమ్ చేశాను. ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేయడం జరిగింది. ఒక మంచి టీమ్ దొరకడంతో బతుకమ్మ షార్ట్ ఫిలిం అందంగా వచ్చింది. బతుకమ్మ మీద షార్ట్ ఫిలిం చేస్తే ఇంత ఆధర అభిమానులు వస్తాయని గెస్ చెయ్యలేదు, అందరూ బాగుందని చెప్తుండడంతో సంతోషంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కమర్షియల్ సినిమాలు చెయ్యడం చెయ్యడంతో పాటు సామాజిక సృహ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ చెయ్యడం నా హాబీ. చెన్నైలో కొన్ని చిత్రాలకు, యాడ్ ఫిలిమ్స్ కు వర్క్ చెయ్యడంతో టెక్నీకల్ గా చాలా విషయాలు నేర్చుకున్నాను. బతుకమ్మ టెక్నీకల్ గా బాగుందని ఫ్రెండ్స్, చూసినవారు చెప్పడం సంతోషం. సైరా సినిమాకు అసోసియేట్ కెమెరామెన్ గా చేసిన సాంబ మా బతుకమ్మను బాగా తీసాడు. నిర్మాత లత గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. భవిషత్తులో నాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్న అన్నారు.

మహేశ్వర గ్రూప్స్ అధినేత కల్వకుంట్ల తేజేశ్వర్ రావ్ (కన్నా రావ్) మాట్లాడుతూ…
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు బతుకమ్మ షార్ట్ ఫిలిం లో చక్కగా చూపించారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికి అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా లతగారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. భవిషత్తులో వారు మరిన్ని మంచి చిత్రాలు చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ…
లత గారు ఎప్పటి నుండో తెలుసు. ఆమె ఈ చేసిన ఈ ప్రయత్నం బాగుంది. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది ? బంగారు తెలంగాణగా ఎలా తయారయ్యింది అనేది ఈ షార్ట్ ఫిలిం లో బాగా చూపించడం జరిగింది. లత మంచి నటి, ఆమె భవిషత్తులో మరింత ఎదగాలని కోరుకుంటున్న అన్నారు

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ…
లత మంచి నటి, ఆమె సొంతంగా పాట రాసి నిర్మించిన బతుకమ్మ షార్ట్ ఫిలిం ను బాగా తీసింది. ఇలాంటి షార్ట్ ఫిలిం ను మనం ఎంకరేజ్ చేస్తే మరింతమంది ఇలాంటి వారు మనకు వస్తారు.

ఎం.ఎల్.ఏ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ…
తెలంగాణ వచ్చాక బతుకమ్మను ఇంకా బాగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలను ఈ షార్ట్ ఫిలిం లో చక్కగా చూపించారు అన్నారు.

ఎమ్.ఎల్.ఏ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ…
అందరికి నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు. లత తీసుకున్న ఈ నిర్ణయం బాగుంది. తెలంగాణ అభివృద్ధిని లత గారు షార్ట్ ఫిలిం లో చక్కగా చూపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావాలని బతుకమ్మ ను మనం ఆడాం. తెలంగాణ వచ్చిన తరువాత బతుకమ్మను మనం మరింత అందంగా జరుపుకుంటున్నాం. కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ఈ షార్ట్ ఫిలిం లో అందంగా చూపించడం జరిగింది. బతుకమ్మ పండుగ గురించి తీసిన ఈ షార్ట్ ఫిలిం ను ప్రజలకు మరింత చేరువ అయ్యేలా చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

ఎక్స్ ఎం.ఎల్. సి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…
ఆనాటి తెలంగాణ ఎలా ఉంది ? ఈనాటి తెలంగాణ ఎలా ఉంది అనేది ఈ లఘు చిత్రంలో చక్కగా చూపించడం జరిగింది. బతుకమ్మ పండగను గౌరవంగా జరుపుకొనే ఈ తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన అనేక పథకాలను పొందుపరిచి తీసిన బతుకమ్మ లఘుచిత్రం చూసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. లత గారు దీన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం అన్నారు.

తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ మాట్లాడుతూ…
నేను ఈ బతుకమ్మ లఘు చిత్రం చూస్తున్నప్పుడు నా చిన్ననాటి సంగతులు గుర్తు వచ్చాయి. లతగారికి మంచి టాలెంట్ ఉంది. ఆమె భవిషత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీయ్యలని కోరుకుంటున్న అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here