సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతున్న ఇంగ్లీష్ చిత్రం “అవర్ లేడి ఆఫ్ లూర్డ్స్”

0

శ్రీ ప్రియ ఇంటర్నేషనల్ బ్యానర్ లో, ఆజ్ఞా నోయిక్స్, అంజన, పి.కమలాకర రావు, డేవిడ్ హార్ట్ ప్రధాన తారాగణంగా, వి.ఆర్ గోపినాధ్ దర్శకత్వంలో, పి.కమలాకరరావు నిర్మించిన చిత్రం “అవర్ లేడి ఆఫ్ లూర్డ్స్”. ఇంగ్లీష్,,తమిళ్,మలయాళ,ఫ్రెంచ్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫాదర్ Rev. Msgr. స్వర్ణ బెర్నార్డ్ వికార్ జనరల్ గారు,చిత్ర నిర్మాత పి.కమలాకరరావు, భాగ్యనాధన్, మార్టిన్ మైఖేల్, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫాదర్ స్వర్ణ బెర్నార్డ్ వికార్ జనరల్ గారు మాట్లాడుతూ: 1858లో ఫ్రాన్స్ లో లూర్దు అనే గ్రామంలో బెర్నదత్ అనే 14 సంవత్సరాల బాలికకు మేరీమాత దర్శన మిచ్చారు.ఆమె మరణించి 130 సంవత్సరాలు అయినా ఇప్పటికి ఆమె మృత దేహం చెక్కు చెదర కుండా ఉండడం విశేషము.ప్రతి సంవత్సరం లూర్థు ని లక్షల మంది భక్తులు సందర్శించు కుంటారు. ఒక మంచి ఉద్దేశం తో తీసిన ఈ సినిమా అందరూ చూడవలసింది. ఈ సినిమాకు పని చేసిన అందరికి అల్ డి బెస్ట్ అని అన్నారు.చిత్ర నిర్మాత కమలాకరరావు మాట్లాడుతూ: నిస్వార్థ మానవ సేవ, అచంచల దైవ భక్తి పెదరాలు అయిన బెర్న దత్ ను సెయింట్ ను చేశాయి. ఫ్రాన్స్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా నిర్మించాము.

ఇప్పటికే ఫ్రాన్స్,పాలెండ్, అమెరికా దేశాలలో ప్రదర్శించబడి ఎన్నో అవార్డుతో పాటు ప్రశంసలను దక్కించుకుంది.ఇంగ్లీష్,తమిళ్,మళయాళ, ఫ్రెంచ్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నాము అందరూ ఈ సినిమా చూడాలి అని అన్నారు.

కధ,మాటలు,స్క్రీన్ ప్లే:పి.కమలాకరరావు
మ్యూజిక్: జాన్ స్వెప్
కెమెరా: బి.దివాకర్
నిర్మాత: పై.కమలాకరరావు
దర్శకత్వం:వి.ఆర్.గోపినాధ్( వి.ఆర్.జి).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here