2021 ఏప్రిల్ లక్ష్యంగా మేఘా పోలవరం పనులు

0

గోదావరి నది ప్రవాహ దూకుడుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కళ్లెం, ఆంధ్రులకు లోక కళ్యాణంగా చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యంగల ప్రాజెక్టు ఎందుకింత నిర్లక్ష్యానికి గురైంది?. ఆంధ్రుల జీవనాడి పోలవరం పనులు ఎందుకు నత్తనడకన సాగాయి? ఇన్నాళ్ల నిర్లక్ష్యం, ఆలస్యానికి మేఘా ఇంజనీరింగ్ రూపంలో బ్రేక్ పడింది. పోలవరంలో వాయు వేగంతో జరిగే పనులకు ఎంఈఐఎల్ తెరలేపింది. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వానికి భారిగా ఆదాయాన్ని మిగిల్చిన మేఘా ఇంజనీరింగ్, అంతే వేగంతో నాణ్యతా ప్రమాణాలలో రాజీ పడకుండా ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడంలో ‘మేఘా’కు సాటిరారెవ్వరు. చేపట్టిన ప్రాజెక్టులను అనుకున్న దానికంటే ముందే పక్కా ప్రాణాళికతో పూర్తి చేయడమే మేఘా ఇంజనీరింగ్ విజయ రహస్యం. ప్రాజెక్టు పనులను దక్కించుకున్న సమయంలో గోదావరి నదికి వరద సమయం కావడంతో వెంటనే పనులను ప్రారంభించడానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో నిర్మాణ పనులను ఉరకలెత్తించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఎంఈఐఎల్ పూర్తిచేసింది.

యేడాదిన్నరలోనే పోలవరం పూర్తికి సర్వం సిద్ధం

పోలవరం నిర్మాణానికి అటు ప్రభుత్వం ఇటు మేఘా ఇంజనీరింగ్ సర్వశక్తులు ఒడ్డి ఒక మహా కార్యానికి శ్రీకారం చుట్టాయి. ఫిబ్రవరి నెల నుంచి పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వరద ప్రవాహంతో ఉప్పొంగే గోదావరి నదిలో పోలవరం కాంక్రీట్ పనులు పరవళ్లు తొక్కుతున్నాయి. దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభమై పుష్కరకాలం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైన పరిస్థితి నుంచి ఇప్పుడు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇంతకాలానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టుదల వల్ల, ఒక దిశ-దశను నిర్దేశించుకొని ముందుకు సాగుతోంది. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌ల్లో పోలవరం ఒకటి. ఈప్రాజెక్టును చేపట్టి యేడాదిన్నరలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆశలు చిగురింపజేసింది ఎంఈఐఎల్.

ఏడు నెలల్లోనే 3.07 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు!

ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులను ఏడెనిమిది నెలల్లో పూర్తిచేయాలనేది మేఘా ఇంజనీరింగ్‌ లక్ష్యం. అందుకు అవసరమైన ఇంజనీరింగ్‌ సిబ్బంది, అధునాతన యంత్రాలతో పాటు, 5 వేల మంది కార్మికులు అనునిత్యం పనిచేసే విధంగా ఏర్పాట్లను పూర్తి చేసుకున్న మేఘా. శ్రామిక శక్తిని మూడు షిఫ్ట్లలో మోహరించి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్న మేఘా ఇంజనీరింగ్. వేగంగా జరుగుతున్న పనులతో, 5వేల మంది శ్రామిక శక్తితో పోలవరం ఒక రణరంగంగా మారిందంటే అతిశయోక్తి కాదు.ఈ పరిస్థితుల్లో పనులను జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించి అవసరమైన సూచనలు,సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈనెల 27న ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు.

పోలవరం ఒక బహుళార్ధ సాధక ప్రాజెక్టు

ఎట్టకేలకు అన్ని అవాంతరాలను అధిగమించి, నిర్మాణ పనులు ఫిబ్రవరి నుంచి వేగవంతమయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా ముప్పైవేలు సాగులోకి రావడంతో పాటు 80 టిఎంసీల నీటిని కృష్ణకు తరలించడమే కాకుండా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టు రబీలో స్థిరీకరించి ఎడమ కాలువ క్రింద లక్షా అరవైవేల ఎకరాలకు నీరందిస్తారు. అదే సమయంలో విశాఖ నగరానికి తాగునీటి మరియు పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టిఎంసీల నీరు అందిస్తారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు మేఘా ఎంట్రీతో క్రియాశీల దశకు చేరుకున్నాయి. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం, హంద్రీ-నీవా, పట్టిసీమ లాంటి అనేక పథకాలను నిర్ణీత గడువుకన్నా ముందే పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను చేపట్టింది. పోలవరంలో ప్రధానమైన పనులు ముఖ్యంగా స్పిల్‌వే, ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామ్‌ మొదలైనవి. 2021 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నాటికి పూర్తిచేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికిగాను మేఘా ఇంజనీరింగ్ ప్రణాళిక బద్దంగా నిర్మాణం పనులను పూర్తి చేయడానికి మైలు రాళ్లను పెట్టుకుంది.ఆ ప్రకారం 2021 ఏప్రిల్ నాటికి ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకపోతే ప్రాజెక్టును పూర్తి చేసే పనులు మొలయ్యాయి.స్పిల్‌వేకు సంబంధించిన 53 బ్లాకులు ముఖ్యమైనవి.అదే సమయంలో మట్టి, కాంక్రీట్‌ పనులు లక్ష్యానికి తగిన విధంగా ప్రతినెలా పూర్తిచేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రాజెక్ట్‌ వద్ద పూర్తయ్యాయి.

గతంలో జరిగిన ఇంజనీరింగ్‌ తప్పిదాలతో అవాంతరాలు

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి భారిగా అంటే 628 కోట్ల రూపాయల ఆదాయాన్ని మిగిల్చిన ఎంఈఐఎల్.నవంబర్‌లోనే పనులను ప్రారంభించినప్పటికీ వెనువెంటనే నిర్మాణ పనులు వేగం చేయడానికి వీలు కాలేదు. అందుకు కారణం గతంలో నిర్మాణ పనులను ఇంజనీరింగ్‌ పద్ధతిలో కాకుండా ఇతరత్రా అవసరాలకు తగిన విధంగా ప్రారంభించడం వల్ల ఇప్పుడు పనులను వేగం చేయడానికి ప్రారంభంలో సమస్యలు తలెత్తాయని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది గోదావరికి భారీ వరదలు ఎక్కువ రోజులు కొనసాగాయి. అప్పట్లో ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో ఇంజనీరింగ్‌ పద్ధతి పాటించకుండా ముందు కాఫర్‌ డ్యాం నిర్మించడం వల్ల స్పిల్‌వే ప్రాంతంలో దాదాపు 4 టిఎంసీల వరద నీరు నిర్మాణ ప్రాంతంలో చేరింది. దీనివల్ల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రాంతమంత ముంపునకు గురవ్వడంతో పాటు అక్కడి రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పని చేపట్టిన తరువాత ఆ ముంపు సమస్య (డీ-వాటరింగ్‌) నుంచి బయటపడడంతో పాటు మళ్లీ రహదారులు నిర్మించుకుని వర్క్స్‌ స్పేస్‌ను తయారు చేసుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది.

ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో మొత్తం పనిని అంటే 2.05 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులను పూర్తిచేయాలనేది మేఘా మైల్‌స్టోన్స్‌ నిర్దేశించుకుంది. ఎత్తు పెరిగేకొద్ది పనులు చేయడం క్లిష్టం అవుతోంది. అదే సమయంలో స్పిల్‌వే బ్లాకుకు సంబంధించిన పియర్స్‌లో కూడా కాంక్రీట్‌ పనులు ఊపందుకున్నాయి. కనీసం రోజుకు 15 వందల క్యూబిక్‌ మీటర్ల పనిచేయాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వేలోని పియర్స్‌, ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌లోని పునాది పనులు గతంలో నిలిచిపోయాయి. వాటిని ఇప్పుడు ప్రభుత్వ లక్ష్యం మేరకు మేఘా వేగం పెంచింది. పోలవరంలో 3గ్యాప్‌లు కీలకం వీటితో పాటు స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్‌-3 చిన్నపాటి కాంక్రీట్‌ డ్యామ్‌గా 150 మీటర్ల పొడవుతో పూర్తిచేయాలి. గ్యాప్‌-2లో ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యాం ఉంటుంది. దీనినే ప్రధానమైన జలాశయంగా పిలుస్తారు. దీని పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. గ్యాప్‌-1లో కూడా ఎర్త్‌కమ్‌ ర్యాక్‌ఫిల్‌ డ్యామే నిర్మించాలి. దీని పొడవు 450 మీటర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు నిర్మించిన ఏ ప్రాజెక్ట్‌లోనూ లేనివిధంగా ఈ జలాశయం పొడవైనది.

2021 ఏప్రిల్‌ లక్ష్యంగా మేఘా పోలవరం పనులు

పోలవరం పనుల్లో స్పిల్‌వే కాంక్రీట్‌ పనిని 5 నెలలో అంటే 2020 జూన్‌ నెలఖరు నాటికి పూర్తిచేయానేది లక్ష్యం. స్పిల్‌వేకు సంబంధించిన బ్రిడ్జ్‌ పనులు ఈ ఏడాది ఆగష్టు నెలాఖరు నాటికి పూర్తికావాలి. అంటే ఈ పని ఏడు నెలల సమయం పడుతుంది. స్పిల్‌ వే చానెల్‌కు సంబంధించిన బ్రిడ్జ్‌ పనులు 2021 మే నాటికి పూర్తికావాలి. ఈ పని మొత్తంగా 14 నెలల సమయం పడుతుంది. స్పిల్‌వేతో సహా మొత్తం ప్రాజెక్ట్‌లో 3.07 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పని ఉంటుంది. ఇంత పెద్ద పనిని ఏడు నెలల్లో అంటే గోదావరికి వరదలు ప్రారంభం కాకముందే ఈ ఏడాది జులై నాటికి పూర్తి చేయాలనేది మేఘా లక్ష్యం. ఇతరత్రా పనులు ముఖ్యంగా ప్రాజెక్ట్‌ కోటింగ్‌, సర్‌ఫేస్‌ డ్రస్సింగ్‌, తారు రహదారి లాంటి ఫినిషింగ్‌ పనులు 2021 ఆగష్టు నాటికి పూర్తవుతాయని అంచనా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here